హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు నిధుల కేటాయింపు రద్దు - go 927
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు.. సీజీఎఫ్ నిధుల కేటాయింపు జీవోను రద్దు చేసింది. ఈ విధానం చట్ట విరుద్ధమని ఓ వ్యాజ్య విచారణలో వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలోని దేవాలయాల నుంచి కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కింద వసూలు చేసిన నిధుల్లో.. 2 శాతం సొమ్మును హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు (హెచ్ డీపీటీ)కు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నిధుల కేటాయింపుపై 2015లో జారీ అయిన జీవో 927ను సవాలు చేస్తూ... ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ డైరెక్టర్ నరేష్ కుమార్ 2018లో వేసిన పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. వివిధ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ పేరుతో దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా హెచ్ డీపీటీకి 2శాతం సీజీఎఫ్ నిధుల్ని కేటాయిస్తున్నార పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. హెచ్ డీపీటీ ఏర్పాటుకు చట్ట బద్దత లేదన్నారు. ఏకీభవించిన న్యాయస్థానం.. దేవాదాయ చట్టలోని సెక్షన్ 70 , 11 నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ కు సీజీఎఫ్ నిధులు కేటాయిస్తున్నారని స్పష్టంచేసింది . ఆ విధానం చట్ట విరుద్ధమని పేర్కొంటూ జీవోని 2శాతం నిధుల కేటాయింపునకు సంబంధించిన భాగాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.