ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలో గ్రామాల్లో అందరికీ కంటి పరీక్షలు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్ని ట్రాక్ చేయాలని సూచించారు. 104 వాహనాల ద్వారా గ్రామాల్లో అందరికీ కంటి పరీక్షలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైద్యాధికారుల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు.

త్వరలో గ్రామాల్లో అందరికీ కంటి పరీక్షలు

By

Published : Jul 4, 2019, 5:54 AM IST

ఆరోగ్య పథకాల అమలు, సీజనల్ వ్యాధుల్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలపై... వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్షించారు. 13 జిల్లాల DMHOలు, DCHSలతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా... వైద్యఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాతా, శిశు మరణాల రేటు తగ్గించేందుకు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఈ విషయంలో కేరళను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. 104 వాహనాల ద్వారా గ్రామాల్లో అందరికీ కంటి పరీక్షలు చేయాలని నిర్దేశించారు. తెలంగాణలో కంటివెలుగు అమలవుతున్న తీరు పరిశీలించాలని సూచించారు. మలేరియా, డెంగీ రాకుండా తీసుకుంటున్న చర్యలను ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాస్థాయి అసుపత్రుల్ని బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యాన్ని అధికారులకు గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details