ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2021 నాటికి పోలవరం... సాగునీటికి రూ.13,139.13 కోట్లు - jagan

తొలి బడ్జెట్​లో ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. జూన్​ 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139.13  కోట్లు కేటాయించింది.

జలయజ్ఞానికి 13 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు

By

Published : Jul 12, 2019, 2:28 PM IST

Updated : Jul 12, 2019, 4:56 PM IST

పోలవరం ప్రాజెక్టును జూన్​ 2021 నాటికి అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునః పరిష్కారం, పునరావాసానికి పూర్తి చర్యలు తీసుకోనుంది. 2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139.13 కోట్లు ప్రతిపాదించింది. వెలిగొండ ప్రాజెక్టు సొరంగం-1ని సంవత్సరంలో.. రెండో సొరంగాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సత్వర సాగునీటిని కల్పించడానికి వంశధార ప్రాజెక్టు, సర్దార్​ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.

జలయజ్ఞానికి 13 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు
Last Updated : Jul 12, 2019, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details