గుంటూరు బరిలో అలీ? - సినీనటుడు అలీ
సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు... గుంటూరు లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యే నియోజకవర్గాల నేతలతో సమీక్షించారు. గుంటూరు తూర్పు నుంచి సినీ నటుడు అలీ పేరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టు సమాచారం.
సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులనుఖరారు చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు... గుంటూరు లోక్‌సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల నేతలతో సమీక్షించారు. 7 స్థానాల ఆశావహులతో చర్చించారు. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర.. తెనాలిలో ఆలపాటి రాజా పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. గుంటూరు తూర్పు నుంచి సినీ నటుడు అలీ పేరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టు సమాచారం. గుంటూరు పశ్చిమలో మద్దాలగిరి, కోవెలమూడి రవీంద్ర మధ్య పోటీ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా శ్రావణ్‌కుమార్ ఉండగా... ఆ స్థానం నుంచి ఎంపీ మాల్యాద్రి, మాణిక్య వరప్రసాద్ మధ్య పోటీ ఉన్నట్టు సమాచారం. ప్రత్తిపాడులో వరప్రసాద్, వీరయ్య, విశ్రాంత ఐఏఎస్ అధికారి మధ్య పోటీ ఉందని.. మంగళగిరి స్థానం నుంచి చిరంజీవులు, హనుమంతరావు, శ్రీనివాసరావు, కమల మధ్య పోటీ ఉందని తెలుస్తోంది.