పిడుగులు పడే అవకాశాలు ఉన్న ప్రాంతాలివే! - పిడుగుపాటు హెచ్చరిక
పిడుగులు పడొచ్చు జాగ్రత్త... అని రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలను విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఆమదాలవలస, పాలకొండ, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి, పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, పార్వతీపురం, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కురుపాంలో పిడుగులు పడొచ్చని అప్రమత్తం చేసింది. గుంటూరు జిల్లాలోని ఈపూరు, బొల్లాపల్లి, పుల్లలచెరువు, పుంగనూరు, పెద్దపంజాని, చౌడేపల్లె, వాయల్పాడు... చిత్తూరు జిల్లా గుడిపాల, యాదమర్రి, బంగారుపాళ్యం మండలాలకు పిడుగుపాటు హెచ్చరికలు చేసింది. ఆయాచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సురక్షితమైన భవనాల్లో ఉండాలని కోరింది.