అగ్రిగోల్డ్ బాధితులు, యాజమాన్యంతో సీఐడీ అధికారులు సమావేశమయ్యారు. అనంతరం అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రూ.20 వేల లోపు ఉన్నవారికి ఇస్తామన్న డబ్బును త్వరగా ఇవ్వాలన్న నాగేశ్వరరావు... హాయ్‌ల్యాండ్, కీసరలోని స్థలాల్లో భవనాలు కడితే ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఆస్తులను 3 కేటగిరీలు చేశామని అగ్రిగోల్డ్ యాజమాన్యం చెప్పిందన్న నాగేశ్వరరావు... అన్ని రాష్ట్రాల్లో ఉన్న బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే తీసుకోవాలి: ముప్పాళ్ల - Agrigold
అగ్రిగోల్డ్ బాధితులు, యాజమాన్యంతో సీఐడీ అధికారుల సమావేశం జరిగింది. బాధితులకు రూ.1,150 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.
సీఐడీ అధికారులతో అగ్రిగోల్డ్ బాధితులు, యాజమాన్యం సమావేశం