ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫొని ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర సాయం 1,086 కోట్లు

ఫొని తుపాను ప్రమాదం పొంచి ఉన్న 4 రాష్ట్రాలకు కేంద్రం ముందస్తు సహాయం ప్రకటించింది. బంగాళాఖాతం తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలకు రూ. 1086కోట్ల నిధులను.. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎఫ్‌ విడుదల చేసింది.

By

Published : Apr 30, 2019, 3:38 PM IST

ఫొని ప్రభావిత రాష్ట్రాలకు 1,086 కోట్లిచ్చిన కేంద్రం

ఫొని తుపాను ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలిచింది. ప్రభావిత ప్రాంతాలైన 4 తీర ప్రాంత రాష్ట్రాలకు ముందస్తుగా నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తమిళనాడు, బంగాల్‌కు విపత్తు స్పందన నిధుల నుంచి 1 వేయి 86 కోట్ల రూపాయలు ఇవ్వాలని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ, హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం మంజూరు చేసిన నిధుల్లో.. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్‌కు 200 కోట్ల రూపాయలు, ఒడిశాకు 340 కోట్లు, తమిళనాడుకు 309 కోట్లు, బంగాల్‌కు 233 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details