గవర్నర్ ప్రసంగానికి తెలిపే ధన్యవాద తీర్మానంపై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రసగించారు. జగన్మోహన్ రెడ్డి ఆధర్వంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వంతో పాటు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ అని అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. అన్నివర్గాల శ్రేయస్సును ప్రతిబింబిచేలా గవర్నర్ ప్రసంగం ఉంటుందని భావించినప్పటికీ అలా లేదని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఐదేళ్లకు ఏం చేస్తోందనే విషయం గవర్నర్ ప్రసంగంలో తెలియపరుస్తారని ఆశించామని కానీ అలాంటిదేమీ లేదని అన్నారు. పట్టిసీమ వృథా ప్రాజెక్టు అయితే మోటర్లు ఆపివేస్తే రైతులు ఎంత ఆగ్రహిస్తారో తెలుస్తోందని మండిపడ్డారు. కేవలం పట్టిసీమ ప్రాజెక్టు ఖర్చుపై మాట్లాడుతున్న సభ్యులు...ప్రయోజనాలపై మాట్లాడాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు 70 శాతం పనులు పూర్తి చేశామని మిగిలిన 30 శాతం పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
ఖర్చుపైనే కాదు ప్రయోజనాలపై మాట్లాడండి: అచ్చెన్నాయుడు
గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రసంగించారు.అన్నివర్గాల శ్రేయస్సును ప్రతిబింబిచేలా గవర్నర్ ప్రసగం ఉంటుందని భావించినప్పటికీ అలా లేదని విమర్శించారు.
ఖర్చుపైనే కాదు ప్రయోజనాలపై మాట్లడండి: అచ్చెన్నాయుడు
అడ్డుతగిలిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుతగిలారు. తెదేపా హయంలో చేపట్టిన ప్రాజెక్టులో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విమర్శించారు. నీరు చెట్టు కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయులు కాజేశారని అన్నారు.