ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మెట్రోకు కొరియా రుణం

విశాఖ మెట్రో నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు కొరియా ఎగ్జిం బ్యాంకు ప్రతినిధులు అంగీకరించారు. సీఎస్ పునేఠను కలిసి చర్చించారు. ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

విశాఖ మెట్రోకు రూ.4,100 కోట్ల రుణం

By

Published : Mar 7, 2019, 6:03 AM IST

Updated : Mar 7, 2019, 9:54 AM IST

విశాఖ మెట్రోకు రూ.4,100 కోట్ల రుణం
విశాఖపట్నంలో నిర్మించనున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు... రూ. 4వేల 100 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు కొరియా ఎగ్జిం బ్యాంకు ముందుకొచ్చింది. ఈ మేరకు కొరియా ఎగ్జిం బ్యాంకు ఆపరేషనల్ డైరెక్టర్ యాంగ్​డాంగ్ చోలే నేతృత్వంలోని ప్రతినిధుల బృందం... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్​చంద్ర పునేఠ... అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టు ఎండి రామకృష్టారెడ్డితో భేటీ అయింది. విశాఖ మెట్రోకు రుణం మంజూరు... ఇతర అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపింది.

ఈ ప్రతిపాదనల్ని పరిశీలించిన కొరియా ఎగ్జిం బ్యాంకు రూ.4 వేల 100 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు అంగీకరించింది. రుణం మంజూరుకు అవసరమైన విధివిధానాలపై ప్రతినిధుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించింది. ప్రాజెక్టు వివరాలు... ఇతర డాక్యుమెంటేషన్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని... సకాలంలో రుణం మంజూరు చేయాలని సీఎస్ పునేఠ ఆ బృందాన్ని కోరారు. విశాఖ మెట్రోరైలు నిర్మాణంపై ప్రభుత్వం ఆసక్తిగా ఉందని... త్వరగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఉన్నామని వివరించారు.

Last Updated : Mar 7, 2019, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details