ముగ్గురు మోదీలు కుట్రలు చేస్తున్నారు: సీఎం చంద్రబాబు - chnadra babu
ప్రధాని మోదీ, కేసీఆర్, ప్రతిపక్షనేత జగన్ కలిసి కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. . వైఎస్ వివేకానంద హత్యను గుండెపోటుగా చిత్రికరించే ప్రయత్నం ఎందుకు చేశారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.
చంద్రబాబు
ప్రధాని మోదీ,కేసీఆర్,ప్రతిపక్షనేత జగన్ కలిసి కుట్రలు పన్నుతున్నారని మఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. శ్రీకాకుళంలో తెదేపా ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల డేటా దొంగింలించిందని ఆరోపించారు. విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. వైఎస్ వివేకానంద హత్యను గుండెపోటుగా చిత్రికరించే ప్రయత్నం ఎందుకు చేశారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి దుర్మార్గాలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు.