21 వేల కోట్ల పెట్టుబడులు - investment
రాష్ట్రంలో 21 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ భారీ స్థాయి ఒప్పందాలను కుదుర్చుకుంది. మొత్తం 14 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈడీబీ సీఈఓ కిషోర్ చంద్రదేవ్ ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 21 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో రానున్న ఈ సంస్థల్లో ప్రత్యక్షంగా 57 వేల మందికి పరోక్షంగా 1 లక్షా 65 వేల మందికి ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లాలో 2 వేల మందికి నేరుగా ఉపాధి కల్పించే అవకాశమున్న మారుతీ ఇస్పాత్, ప్రైవేట్ లిమిటెడ్ 1227కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. ప్రకాశం జిల్లాలో 9,000 వేల కోట్లతో తెలుగు ఫార్మాస్యూటికల్స్ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో 1600 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.