సీఎం అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ప్రకటించిన సీఎం - cabinet meeting
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు సీఎం ఆమోదించారు.
సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం
అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అభినందించడంపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలన్న విషయంపైనా మాట్లాడారు. ఏలూరు స్మార్ట్ సిటీ అంశంపై మరో మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
Last Updated : Feb 8, 2019, 9:39 PM IST