ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్​డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

నేటి నుంచి మెుదలు కానున్న ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్​డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం డైర‌క్ట‌ర్ ఎ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్​డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

By

Published : Jun 16, 2019, 8:51 PM IST

Updated : Jun 17, 2019, 4:01 AM IST

నేటి నుంచి ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్​డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు మెుదలు కానున్నాయి. ఈనెల 29 వ‌ర‌కు జరగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం డైర‌క్ట‌ర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఉద‌యం 9 గంటల 30 నిమిషాల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జరగనున్నాయి. ఈ ప‌రీక్ష‌లకు మొత్తం 38 వేల 872 మంది విద్యార్థులు హాజ‌రు అవుతార‌ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 201 ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 15 ఫ్ల‌యింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామ‌న్నారు. స్పాట్ వాల్యుయేష‌న్ జూలై 4, 5 తేదీల‌లో జ‌రుగుతుంద‌ని... విశాఖ, కాకినాడ‌, గుంటూరు, క‌డ‌ప‌లో కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.

ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్​డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు
Last Updated : Jun 17, 2019, 4:01 AM IST

ABOUT THE AUTHOR

...view details