YSRCP Leaders try to Occupy Land :బాపట్ల పరిధిలో ఉన్న 1.20 ఎకరాల వ్యవసాయ భూమిని మంత్రి మెరుగు నాగార్జున (Minister Merugu Nagarjuna) అనుచరుల పేరిట వచ్చిన కొందరు వ్యక్తులు భయపెట్టి బలవంతంగా భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని అనిత అనే మహిళ ఆరోపించారు. నరాలశెట్టిపాలెం సమీపంలోనే వ్యవసాయ భూమి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మాట్లాడుతూ ఆమె తెలిపిన వివరాల ప్రకారం పోతంశెట్టి వెంకట కృష్ణయ్య నుంచి 1970లో బొమ్మిశెట్టి శివరామకృష్ణ ప్రసాద్ 5.56 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని శివరామకృష్ణ ప్రసాద్ నుంచి 1981లో తన అమ్మమ్మ కొనుగోలు చేశారని అన్నారు. పూర్వార్జిత ఆస్తి కింద తండ్రి ద్వారా భూమి తనకు సంక్రమించిందని తెలిపారు. అయితే4.36 ఎకరాల భూమిని మాత్రమే శివరామకృష్ణ ప్రసాద్ తమకు రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు
Ruling Party Leaders Rowdyism on People :సర్వే నంబర్లో తప్పు వచ్చిందని1.20 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ ఆపేశారని అన్నారు. దీనిపై కోర్టులో వ్యాజ్యం నడుస్తుందన్నారు రెండు నెలల క్రితం వెంకట కృష్ణయ్య కోడలు శారదా దేవి కుటుంబ సభ్యులు వచ్చి భూమి తమదని వచ్చి కొలతల కొలవబోగా తాము అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 40 ఏళ్లుగా భూమి తమ ఆధీనంలో ఉందని అధికారులకు పత్రాలు చూపించామని అన్నారు. నెల రోజుల నుంచి మంత్రి మెరుగు నాగార్జున బంధువులు, అనుచరులు అంటూ 30 మంది పలుమార్లు కార్లలో వచ్చి భూమి ఖాళీ చేయాలని తమను బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శారదా దేవి నుంచి తాము కొన్నమని ఖాళీ చేయకపోతే మీ అంతు చూస్తామంటూ బలవంతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Gandhi satram: గాంధీ సత్రాన్నీ వదలని మంత్రి.. 33 ఏళ్లకు లీజుకివ్వాలంటూ ఒత్తిళ్లు