YSRCP Dissident Factions Fire on New In-Charges: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సార్వత్రిక ఎన్నికల ముందు 11 నియోజకవర్గాలకు కొత్తగా సమన్వయకర్తలను నియమించటంపై, ఆ పార్టీ అసంతృప్తులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. నియోజకవర్గాలకు కొత్తగా నియమించిన ఇంఛార్జ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. అధిష్ఠానం దిగిరాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రజలకు తెలియని కొత్త వ్యక్తులను ఇంఛార్జ్‌లుగా నియమించడంపై పార్టీ అధిష్ఠానం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
TS Election Effect CM Jagan Changes: తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన ఫలితాల కారణంగా సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. సిట్టింగ్‌లలో భారీ మార్పులకు తెరతీశారు. మంత్రులు, సిటింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలపై అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐ-ప్యాక్ చేసిన సర్వేల ఆధారంగా 11 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చేస్తూ, వారి స్థానాల్లో కొత్త ఇంఛార్జ్‌లను నియమించారు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి, బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గాల్లో వైసీపీ అసంతృప్తి నేతలు నిరసనలకు దిగారు. నూతన ఇంఛార్జ్‌లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచుతున్నాడు
Guntur YCP disgruntled Leaders Protest: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయడంతో నియోజకవర్గం ఇంఛార్జ్‌గా గంజి చిరంజీవిని అధిష్ఠానం నియమించింది. దీంతో ఆ పార్టీ అసంతృప్తి కార్యకర్తలు సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టైర్లు తగులబెట్టి, నిరస తెలిపారు. అధిష్ఠానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు. వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవికి టిక్కెట్ ఇస్తే ఆయన్ను కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు.