YSR STAMP ON EGGS : పాఠశాలల్లో విద్యార్థులకు అందించే కోడిగుడ్డుపై వివిధ రకాల స్టాంపులు వేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లపై వైఎస్సార్ ఎస్పీ అని స్టాంప్ వేశారు. మామూలుగా బాలింతలు, చిన్నారులు, విద్యార్థులకు పంపిణీ చేసే గుడ్లకు.. మార్కెట్లో దొరికే వాటికి తేడా తెలిసేందుకు, అవి దుర్వినియోగం కాకుండా స్టాంపు వేస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం మరి కొంచెం ఆలోచించి.. వైఎస్సార్ ఎస్పీ పేరుతో ఉన్న గుడ్లను విద్యార్థులకు అందించారు. వైఎస్సార్ తాత పేరు కూడా గుర్తించుకోవాలని జగన్ మామ ఈ కోడిగుడ్లు ఇచ్చారేమో అని పిల్లలు అనుకుంటున్నారు.
మరోసారి చర్చలోకి వైఎస్సార్ పేరు.. ఈసారి ఏకంగా కోడిగుడ్లపైనే - బాపట్లలో కోడిగుడ్లపై వైఎస్సార్ స్టాంప్
YSR STAMP ON EGGS: బాలింతలు, అంగన్వాడీలో చిన్నారులు, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది. అయితే సహజంగా ఆ కోడిగుడ్లు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం స్టాంపులు వేస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోడిగుడ్లపై వైఎస్సార్ స్టాంప్ వేసి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.
YSR STAMP ON EGGS