Suicide: ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం తూర్పుపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అపర్ణ (26) బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి అపర్ణ విగతజీవిగా కనిపించింది. కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు ఆత్మహత్య చేసుకోవడానికి ఓ యువకుడి వేధింపులు కారణమని స్థానికులు చెబుతున్నారు.
Suicide: ఉరివేసుకుని యువతి ఆత్మహత్య.. కారణం అదేనా..? - తూర్పుపాలెంలో యువతి ఆత్మహత్య
Suicide: రాష్ట్రంలో రోజురోజుకు ఆత్మహత్యల ఘటనలు పెరిగిపోతున్నాయి. వివిధ కారణాలతో చాలా మంది ఊపిరి వదిలేస్తున్నారు. కారణం చిన్నదా.. పెద్దదా? అన్న సంబంధం లేకుండా పరిష్కారం కోసం ఆలోచించకుండా క్షణికావేశంలో ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా.. బీటెక్ పూర్తి చేసిన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య