Young People Died in Ganesh Idols Immersion: రాష్ట్రంలో వినాయక నిమజ్జనం కార్యక్రమాలు పలు చోట్ల విషాదం నింపాయి. అప్పటి వరకూ సరదాగా స్నేహితులతో ఆట పాటలాడుతూ ఉన్న యువకులు.. అంతలోనే మృత్యువాత పడ్డారు. దీంతో ఆ యువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాసేపటి వరకూ సరదాగా తమతో ఉన్న వ్యక్తి మరణించడంతో.. ఆ యువకుల స్నేహితులు సైతం శోకసంద్రంలో మునగిపోయారు. మరోచోట గణేష్ మండపం వద్ద హుషారుగా డ్యాన్స్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు మృతి: బాపట్ల జిల్లా రేపల్లె మండలంలో వినాయకుని విగ్రహ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. పెనుమూడి వద్ద కృష్ణా నదిలో విగ్రహ నిమజ్జనం చేస్తుండగా ఇద్దరు యువకులు నదిలో పడి గల్లంతయ్యారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గల్లంతైన ఇద్దరు యువకులు వెంకటేష్(25), విజయ్(22) మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు రేపల్లె పట్టణం 24వ వార్డ్ నేతాజీ నగర్ వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Man Washed Away In Waterfall : చూస్తుండగానే జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు.. లైవ్ వీడియో
Young Man Died while Dancing at Ganesha Stage: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు: గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్లో గణేష్ మండపం ఆవరణంలో బుధవారం రాత్రి డాన్స్ చేస్తూ ప్రసాద్ 32 అనే యువకుడు కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు డాన్స్ చేస్తూ కిందపడిన ప్రసాద్‌ను స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుడైన ప్రసాద్ మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.