YCP Leader Fraud in the Name of Job :ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు.. ఏళ్లు గడుస్తున్నా సమాధానం లేదు.. మోసపోయానని నిలదీస్తే.. చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఓ బాధితుడు స్పందనలో ఫిర్యాదు చేశాడు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త యాతం క్రాంతి రెండేళ్ల క్రితం.. తమ కుమారుడికిప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 4.50 లక్షలు వసూలు చేశారని వాడరేవుకు చెందిన వ్యక్తి బాధితుడు జాలే రూబే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. క్రాంతి కాలయాపన చేస్తుండటంతో మోసపోయానని గ్రహించి.. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే.. చంపుతామని బెదిరిస్తున్నాడని వాపోయాడు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని.. లేకపోతే తమ కుటుంబంతో సహా ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు.
Scam in Vijayawada: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎర.. 80 మంది నుంచి కోట్లలో వసూలు చేసిన మహిళా లీడర్
Family Wants Permission to Commit Suicide : సుమారు రెండు సంవత్సరాల కిందట తన కుమారుడికి బ్యాక్‌లాగ్ పోస్టు ఇప్పిస్తాననిచెప్పి.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త క్రాంతి విడతల వారీగా రూ.4.50 లక్షలు వసూలు చేశాడని జాలే రూబే ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎన్నాళ్లు చూసినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో క్రాంతిని నిలదీసినట్లు తెలిపాడు. దీంతో గత సంవత్సరం ఏప్రిల్‌లో చీరాలలోని ఓ ఉన్నత పాఠశాలలో ఉద్యోగం ఇస్తున్నట్లు నమ్మించి.. రాష్ట్ర ప్రభుత్వం పేరుతో ఓ నకిలీ ఉద్యోగ నియామక పత్రాన్ని ఇచ్చినట్లు వివరించాడు.
Frauds of YCP Leaders in Bapatla District :ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి.. క్రాంతిని ప్రశ్నించగా రూ.50 వేలు తిరిగి ఇచ్చాడు. మిగిలిన మొత్తం ఇవ్వకుండా అసభ్యకరంగా దూషిస్తూ.. చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపాడు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని,.. జులై 31న జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తే తక్షణమే క్రాంతిని అరెస్టు చేయాలని చీరాల డీఎస్పీకి వారు ఆదేశాలు జారీ చేశారని.. కానీ ఈరోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.