సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. రాష్ట్రంలో వరుసగా ఎక్కడోచోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బాపట్ల జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.
Rape at Repalle: రేపల్లెలో దారుణం.. భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం
07:06 May 01
నిందితులు ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తింపు
Rape at bapatla: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. బాధిత మహిళ భర్తను కొట్టి.. వలస కూలీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపారు. భర్త వద్దనున్న కొంత నగదును లాక్కెళ్లినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత దంపతుల నుంచి వివరాలు సేకరించారు. బాధితురాలిని రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పీఎస్‌కు వెళ్లినా స్పందించలేదు..రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై అత్యాచారాన్ని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఖండించారు. భర్తను బెదిరించి భార్యపై ముగ్గురు అత్యాచారం చేయడం దారుణమని మండిపడ్డారు. భర్త పీఎస్‌కు వెళ్లి ఎన్నిసార్లు తలుపు కొట్టినా స్పందించలేదని అనగాని ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీ బిహార్‌లా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఇంట్లో ఉన్నా, రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆక్షేపించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోందని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: