ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్ల జిల్లాలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవదహనం - Woman cremated in ullipalem fire accident

ullipalem fire accident
అగ్ని ప్రమాదంలో మహిళ సజీవదహనం

By

Published : May 27, 2022, 6:05 PM IST

Updated : May 27, 2022, 10:13 PM IST

17:51 May 27

ullipalem fire accident: అగ్ని ప్రమాదంలో మహిళ సజీవదహనం

Woman Burnt in Ullipalem Fire Accident: బాపట్ల జిల్లా నగరం మండలం ఉల్లిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ మహిళ సజీవదహనం అయింది. ఉల్లిపాలెం గ్రామానికి చెందిన కుల్లి జెన్నిమ్మ(46).. పూరి గుడిసె(పాక)లో ఒంటరిగా ఉంటోంది. ఇవాళ మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ జరగడంతో పాకకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమావక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న జెన్నిమ్మ.. ఆ మంటల నుంచి తప్పించుకోలేకపోయింది. చివరకు మంటల్లోనే సజీవదహనం అయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

Last Updated : May 27, 2022, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details