Volunteer burned survey papers at bapatla district: 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమం కోసం అధికారులు తమతో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని బాపట్ల జిల్లాలో ఓ వాలంటీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారి జాబితా కోసం ప్రత్యేకంగా ఇంటింటి సర్వే చేయాలని వాలంటీర్లను అధికారులు ఆదేశించారు. వాలంటీర్లందరికీ సర్వే కాగితాలు పంపించారు. అయితే వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలుకు చెందిన గ్రామ వాలంటీరు బాషా.. అధికారుల తీరును నిరసిస్తూ ఆ సర్వే కాగితాల్ని కాల్చి వేశారు. ఆ వీడియోను అధికారులు, వాలంటీర్లు ఉండే వాట్సప్ గ్రూప్‌లో పోస్టు చేశారు.
గొడ్డు చాకిరీ చేయించుకుంటే ఫ్రస్ట్రేషన్ ఇలాగే ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలందించామని, లబ్ధిదారులు ఇతర జిల్లాల్లో ఉంటే అక్కడకు వెళ్లి మరీ పెన్షన్లు అందజేశామని తెలిపారు. తమ సేవలను గుర్తించకుండా.. గొడ్డు చాకిరీ చేయిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు భాషా ఓ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత బాషా.. భట్టిప్రోలుఎంపీడీవోను కలిసి తన రాజీనామా లేఖ అందించారు.
ఇదీ చదవండి: