Variety Marriage Proposal In Bapatla: రాజుల కాలంలో తమ కలల రాకుమారి కోసం రాజులు గుర్రాలపై రాజ్యమంతా తిరిగి పెళ్లిళ్లు చేసుకునేవారు. అది మనందరికీ తెలిసిన చరిత్రే... కానీ ఈ తరం వాళ్లు తమ వధువు కోసం.. మ్యాట్రిమోనీ యాప్‌లు, పెళ్లిళ్ల బ్యూరోల చుట్టూ తిరుగుతున్నారు. అంత తతంగం ఇష్టంలేని వాళ్లు చక్కగా తల్లిదండ్రులు చూసిన అమ్మాయినో, మనసుకు నచ్చిన భామనో మనువాడాలనుకుంటున్నారు. కానీ వీటన్నింటికి భిన్నంగా ఓ వ్యక్తి తన సైకిల్‌నే రథమని భావించి ఫ్లెక్సీపై ఆహ్వాన పత్రంతో జీవిత భాగస్వామి కోసం బయలుదేరాడు. ఇంత వింతగా వెతుకుతున్న వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందామా.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన ఓ యువకుడు తన జీవిత భాగస్వామి కోసం సైకిల్‌పై తిరుగుతున్నాడు. పెళ్లెప్పుడవుతుంది బాబూ.. నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబోయ్.. అంటూ వేటపాలెం నుంచి చీరాల వరకు సైకిల్‌పై తిరుగుతూ.. ముఖ్య కూడళ్లలో తన కాబోయే శ్రీమతి తనను వరించాలంటే ఏం చెయ్యాలనే అంశాలతో ప్లెక్సీ ప్రదర్శిస్తూ.. అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు.
అనంతపురం జిల్లాలో వింత ఆచారం.. వర్షాలు పడాలని గాడిదలకు పెళ్లి
Registration Compulsory For Marriage : యుక్త వయస్సు దాటుతున్నా పెళ్లి కాకపోవడంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు బీకాం చదువుకున్న నీలకంఠం అయ్యప్ప కుమార్. తనను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడిరోడ్డుపై స్వయంవరానికి కౌంటర్‌ను ఏర్పాటు చేశాడు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్ అనే యువకుడు బీకాం చదివాడు.. ఇతనికి ఇరవయేళ్ల వయసు దాటినా ఇంకా పెళ్లి కాకపోవడంతో ఇలా చేస్తున్నాడు. తనంటే ఇష్టపడే అమ్మాయిలు.. తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చీరాలలోని పలు ప్రాంతాల్లో సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోదలచిన వారు తమ పేరు, ఫోన్ నంబర్‌ను తన వద్ద ఉన్న పుస్తకంలో రాయాలని లేదా స్వయంగా తన ఇంటికి రావాలంటూ చెబుతున్నాడు. తన ఇంటి గోడపైన కూడా వివరాలు రాశాడు.