Vande Bharat Train Trial Run : కేెంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ సేవలు ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నూతనంగా ప్రారంభించనున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రోజు చెన్నై నుండి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా ఒంగోలు ఉదయం గం 5.20 నిమిషాలకు, చీరాల 6.25 నిమిషాలకు, విజయవాడకు ఉదయం గం 8.25 నిమిషాలకు చేరుకుంది.
ఫిబ్రవరిలో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు.. ట్రయల్ రన్ పూర్తి - వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుండి చెన్నై వరకు
Vande Bharat Train Trial Run: కేెంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను వివిధ ప్రాంతాలకు అందుబాటులోకి తెస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల 15న సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 8వ వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. అలాగే వచ్చే నెలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్ప్రెస్ సేవలను అందుబాటులోకి తేనుంది. అందుకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.
Vande Bharat Train Trial Run
ఫిబ్రవరి నెలలో ఈ వందేభారత్ రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ నెల 15న సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 8వ వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించగా.. వచ్చే నెలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నూతనంగా ప్రారంభించనున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ 9వది కానుంది.
ఇవీ చదవండి:
Last Updated : Jan 29, 2023, 7:18 PM IST