అలల తాకిడికి సముద్రంలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా సూర్యలంకలో చోటు చేసుకుంది. ఏరువాక పౌర్ణమి కావడంతో అలల తాకిడి ఎక్కువగా ఉందని మెరైన్ పోలీసులు పర్యాటకులను హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు సముద్రం స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.
సముద్రపు అలల తాకిడికి ఇద్దరు యువకులు మృతి - సముద్రపు అలల తాకిడికి ఇద్దరు యువకులు మృతి
సముద్రపు అలల తాకిడికి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో చోటు చేసుకుంది. మెరైన్ పోలీసులు వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ యువకులు మృతి చెందారు.
అలల తాకిడికి ఇద్దరు యువకులు మృతి
మృతులు తెనాలికి చెందిన ఏడుకొండలు, చినగంజాం మండలం ములగానివారిపాలేనికి చెందిన హారీష్ రెడ్డిగా గుర్తించారు. యువకుల మృతితో వారి కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి
TAGGED:
అలల తాకిడికి ఇద్దరు మృతి