Tragedy in Vacation Tour: విహార యాత్ర కాస్తా విషాదయాత్రగా మారడంతో ముగ్గురు విద్యార్థినుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. బాపట్ల జిల్లా వేటపాలెంలోని అనుజ్ఞ ప్రైవేటు పాఠశాల పదో తరగతి విద్యార్థినులు, ఉపాధ్యాయులు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు విహారయాత్రకు వెళ్లారు. చింతూరు వ్యూ పాయింట్‌లోని సకిలేరు వాగులో ప్రమాదవశాత్తు ముగ్గురు విద్యార్థినులు గుమ్మడి జయశ్రీ(14), సువర్ణ కమల(14), గీతాంజలి(14) కొట్టుకుపోయారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, గజఈతగాళ్ళు గాలింపు చేపట్టారు. రెండు మృతదేహాలు లభ్యం కాగా.. గీతాంజలి కోసం గాలింపు చేపట్టారు.
విహారయాత్రలో విషాదం.. వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు - students lost life
students lost life: కొత్త ప్రదేశాలు చూసొద్దామని వెళ్లిన పాఠశాల విద్యార్థులు వాగులో గల్లంతైన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు విహారయాత్ర కోసం వెళ్లిన ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు చెందిన ముగ్గురు విద్యార్థినులు సకిలేరు వాగులో పడి గల్లంతయ్యారు. ఘటన ఉదయం జరిగినా.. తమకు ఎందుకు చెప్పలేదని వేటపాలెంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
ప్రసార మాద్యమాల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వేటపాలెంలోని పాఠశాల వద్దకు చేరుకున్నారు. పాఠశాలకు తాళం వేసి ఉండటంతో నిర్వాహకుల ఇంటికి వెళ్లి వివరాలు అడగ్గా.. సరైన సమాధానం రాకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పదిన్నరకు ప్రమాదం జరిగితే.. తమకు మద్యాహ్నం వరకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చింతూరు బయలుదేరి వెళ్ళారు. ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థినులు మృతి చెందడంతో వేటపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.