Surya Lanka beach in AP: వారాంతపు సెలవులు, కార్తీక మాసం ఆదివారం కావడంతో బాపట్ల జిల్లా సూర్యలంక, వాడరేవు, రామాపురం సముద్రతీరాలు పర్యాటకులతో సందడిగా మారాయి. బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరానికి పర్యాటకులు పోటెత్తారు.. చిన్న,పెద్ద తారతమ్యం లేకుండా సముద్రస్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు. అధికారులు తీరంలో జల్లు స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాపట్ల గ్రామీణ సీఐ వేణుగోపాలరెడ్డి లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదంటూ బోటుపై తీరంలో తిరుగుతూ.. పర్యాటకులకు సూచనలిచ్చారు. గతంలో జరిగిన విషాద ఘటనల నేపథ్యం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తూ.. సముద్రంలో లోతుకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
కార్తిక మాసం.. సూర్యలంక సముద్ర తీరంలో పుణ్యస్నానాలు - latest news on Surya Lanka beach on Sunday
Tourists flocked to Surya Lanka beach: వారాంతపు సెలవులు, కార్తిక మాసం ఆదివారం కావడంతో బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరానికి పర్యాటకులు పోటెత్తారు. పిల్లలు, పెద్దలు అందరూ సముద్రస్నానాలు చేస్తూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. జల్లు స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారులు బోటులో తిరుగుతూ పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు.
Surya Lanka beach
TAGGED:
Surya Lanka beach on Sunday