GANJA: రాష్ట్రంలో గంజాయి ఎక్కడపడితే పట్టుబడుతూనే ఉంది. గతంలో పట్టణాలు, నగరాల్లో లభించే గంజాయి.. తాజాగా మండలాలకు, పల్లెలకు పాకిింది. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా జరుగుతుంది. పోలీసుల దాడుల్లో వందల కిలోలు పట్టుబడుతుంటే పోలీసుల కన్నుగప్పి వేలాది కిలోల గంజాయి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. మహిళలే గంజాయి అమ్మకాల్లో పాలుపంచుకుంటున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. బాపట్ల జిల్లాలో బీచ్ వద్ద గంజాయిని పొట్లాలుగా తయారు చేసి.. మహిళలే అమ్మడం అందరిని ఆశ్చర్యాన్ని కనిగిస్తుంది. తాజాగా బాపట్ల జిల్లాలో ఇద్దరు మహిళలు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబటం.. పోలీసుల్ని ఆందోళనలో పడేసింది.
గంజాయి పొట్లాలు:బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో పోలీసులు దాడులు చేశారు. వేటపాలెం రోశయ్య కాలనీలో 240 గ్రాములుగా గంజాయిని చిన్న పొట్లాలు చేసి అమ్మకాలు సాగిస్తున్న ఇద్దరు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. బచ్చుల వారిపాలెంలో ఓ ఇంట్లో చీరాల రూరల్ సీఐ మల్లి ఖార్జున రావు దాడి చేసి 5.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మల్లి ఖార్జున రావు మాట్లాడుతూ ఎస్పీ వకుల్ జిందాల్ అదేశాల మేరకు నిషేధిత గంజాయి అక్రమార్కులపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని అన్నారు. వారాంతపు శెలవు రోజుల్లో తీరప్రాంతంలో పూర్తిగా పోలీసులు గస్తీ ఏర్పాటుచేయాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.