New varieties of rice: బాపట్ల జిల్లాలోని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు బీపీటీ-3082 అనే కొత్త వంగడాన్ని ఆవిష్కరించారు. ఖరీఫ్‌లో రైతులతో ప్రయోగాత్మకంగా సాగు చేయించడానికి మినీ కిట్లలో విత్తనాలను సిద్ధం చేశారు. మరో రెండు బీపీటీ-2846, బీపీటీ-2841 వంగడాలూ మూడేళ్ల ప్రయోగాత్మక సాగు పూర్తి కావడంతో మార్కెట్లోకి విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నారు.
New varieties of rice: మూడు కొత్త వరి వంగడాలు - Bapatla Agricultural Research institute Scientists
New varieties of rice: బాపట్ల జిల్లాలోని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు బీపీటీ-3082 అనే కొత్త వంగడాన్ని ఆవిష్కరించారు. మరో రెండు బీపీటీ-2846, బీపీటీ-2841 వంగడాలూ మూడేళ్ల ప్రయోగాత్మక సాగు పూర్తి కావడంతో మార్కెట్లోకి విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నారు.
మూడు కొత్త వరి వంగడాలు
ఖరీఫ్‌లో సాగు చేసేలా సాంబ మసూరి (బీపీటీ-5204) లక్షణాలతో బీపీటీ-3082 అనే స్వల్పకాలిక కొత్త వంగడాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని పంటకాలం 135 నుంచి 140 రోజులు. సన్నరకం గింజ, అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 40 నుంచి 45 బస్తాలు వస్తుంది. వంగడం పొట్టి రకం. కాండం దృఢంగా ఉండటంతో వర్షాలు, గాలులకు త్వరగా పడిపోదు. కంకి పొడవుగా ఉండి 350 నుంచి 400 గింజలు వస్తాయి.
- శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితం ఆవిష్కరించిన బీపీటీ-2846 వంగడం ప్రయోగాత్మక సాగు పూర్తి చేసుకుంది. ఈ వంగడం అధిక వర్షాలను తట్టుకుంటుంది. పంట కాలవ్యవధి 145 నుంచి 150 రోజులు. గింజ సన్న రకం. అగ్గి తెగులు, దోమపోటు తట్టుకుంటుంది. ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తుంది.
- నల్ల ధాన్యం రకం బీపీటీ-2841 వంగడాన్ని మూడేళ్ల క్రితం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి రైతులతో ప్రయోగాత్మక సాగు చేయించి మంచి ఫలితాలు సాధించారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. ఎకరాకు దిగుబడి 30 నుంచి 35 బస్తాలు వచ్చింది. అగ్గి, ఆకు ఎండు తెగులు, దోమపోటును తట్టుకుంది.
- బియ్యంలో ప్రోటీన్ 11.50 శాతం ఉంటుంది. జింకు 27 పీపీఎం, ఐరన్ 17 పీపీఎం ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు 110 ఎం.జి. ఈ బియ్యంలో రోగ నిరోధకశక్తి ఎక్కువ. త్వరలో మార్కెట్లోకి విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి: