ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీకి 400.. ట్రాక్టర్​కు 800.. ఇసుక ధరల్లో గోల్​మాల్ - బాపట్ల జిల్లా తిమ్మాయపాలెం

Gundlakamma sand reach : బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గుండ్లకమ్మ ఇసుక రీచ్‌ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను స్థానికులు, ట్రాక్టర్‌ యజమానులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లకు అధిక రేటు తీసుకుంటున్న జేపీ సంస్థ లారీలకు సగం ధరకే అందించడంలో ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. ట్రాక్టర్‌కు, లారీకి వ్యత్యాసమేంటని ఇసుక తరలింపుదారులను స్థానికులు నిలదీశారు.

గుండ్లకమ్మ ఇసుక రీచ్‌
గుండ్లకమ్మ ఇసుక రీచ్‌

By

Published : Mar 1, 2023, 6:14 PM IST

Gundlakamma sand reach : బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గుండ్లకమ్మ ఇసుక రీచ్‌ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను స్థానికులు, ట్రాక్టర్‌ యజమానులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లకు ఇసుక టన్నుకు రూ.800 వసూలు చేస్తున్న జేపీ సంస్థ.. లారీలకు మాత్రం టన్నుకు రూ.400 మాత్రమే వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇసుక తరలింపుదారులు లారీ యజమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాక్టర్‌కు, లారీకి వ్యత్యాసమేంటని ఇసుక తరలింపుదారులను స్థానికులు నిలదీశారు.

గుండ్లకమ్మ రీచ్ వద్ద వివాదం..:ఇసుక తరలింపులో వ్యత్యాసాలపై వివాదం ఏర్పడింది. స్థానిక ట్రాక్టర్లకు టన్నుకు 800 రూపాయలు వసూలు చేస్తున్న అధికారులు.. లారీలకు మాత్రం అందులో సగం ధరకే అమ్ముకుంటున్నారు. టన్ను ఇసుక 400 రూపాయలకే అమ్మడంపై ట్రాక్టర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా ఏకమై ఇసుక తరలిస్తున్న లారీలను అడ్డగించారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన జరిగినా సమస్యకు పరిష్కారం దొరకలేదు.

వాహనాల అడ్డగింత..: బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గుండ్లకమ్మ ఇసుక రీచ్ వద్ద ఇసుక తరలిస్తున్న లారీలను స్థానికులు అడ్డుకున్నారు. తిమ్మాయిపాలెం, రామాయపాలెం ఇసుక రీచ్​ల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని వాహనాలను అడ్డుకుని.. నిలిపివేశాచారు. ట్రాక్టర్లకు టన్ను ఇసుకకు ఎనిమిది వందల రూపాయలు వసూలు చేస్తున్న జేపీ కంపెనీ నిర్వాహకులు... లారీలకు టన్నుకు 400 రూపాయలు వసూలు వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు. ఈ కారణంతోనే టిప్పర్లలో ఇసుక తరలింపుదారులకు, పట్టణ, స్థానిక ట్రాక్టర్ యజమానుల మధ్య వాగ్వాదం నెలకొంది. ట్రాక్టర్​కి, లారీకి వ్యత్యాసం ఏమిటని స్థానిక ఇసుక తరలింపుదారులు నిలదీశారు. దాదాపు రెండు గంటల పాటు నాలుగు ఇసుక టిప్పర్లు అడ్డగించి నిలిపేసినా.. జేపీ కంపెనీ తరఫున బిల్లులు వసూలు చేస్తున్న వ్యక్తులు ఎవ్వరూ స్పందించలేదు. స్థానిక ఎస్ఈబీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని స్థానిక ట్రాక్టర్ల ఇసుక తరలింపుదారులు అయోమయానికి గురయ్యారు. ఎట్టకేలకు జేపీ కంపెనీ తరఫున వచ్చిన వ్యక్తి ట్రాక్టర్లు, ఇసుక తరలింపుదారులతో చర్చించారు. సాయంత్రానికల్లా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వాహనాలను పంపినట్లు సమాచారం.

ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ల ఆందోళన...:ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఇసుక రవాణా, లోడింగ్ చేసిన కాంట్రాక్టర్లు ఆ సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అప్పుు తీసుకువచ్చి ఇసుక రవాణా చేస్తే బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటే జగన్ తమను రోడ్డుకు లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details