TDP Sympathizers Votes Deletion: టీడీపీ కంచుకోట అయిన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్లు తొలగించే కుట్ర కొనసాగుతోంది. కచ్చితంగా టీడీపీకే ఓటేస్తారనుకునే వారిని ముందే గుర్తించి.. జాబితా నుంచి వారి ఓట్లు తొలగించాలంటూ వైసీపీ నాయకులు భారీగా ఫారం-7 దరఖాస్తులు చేయిస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుల సంతకాలు ఫోర్జరీ చేసి.. ఓటు తొలగింపునకు వారే దరఖాస్తు చేసుకున్నట్లు.. ఫారం-7లు పెడుతున్నారు. ఈ అక్రమాలు (Irregularities in Voter List) కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపు కోసం మొత్తం 38 వేల 3వందల 11 ఫారం-7లు అందగా.. వాటిలో పర్చూరు నియోజకవర్గానివే 13 వేల 9వందల 52 ఉన్నాయి. వైసీపీ నాయకులే ఈ కుట్ర నడిపిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
మార్టూరు మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉప్పుటూరు రమాదేవి ఓటు తొలగించాలంటూ ఆమె పేరిటే గుర్తుతెలియని వ్యక్తి దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తు ఎవరు చేశారో తేల్చాలని అధికారులను ఆమె డిమాండ్ చేశారు. యద్దనపూడి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి.. ఆయన స్వగ్రామంలో ఓటు ఉంది. ఓటర్ జాబితా నుంచి ఆయన పేరు తీసేయాలంటూ మరో వ్యక్తి ఫారం-7 సమర్పించారు. ఓటు తొలగింపు నోటీసు అందుకున్న ఆ ఉపాధ్యాయుడు విచారణకు హాజరై.. తన ఓటు ఎలా తీసేస్తారని అధికారులను ప్రశ్నించారు.
TDP Sympathizers Votes Deletion: దృష్టి మళ్లించి డబ్బులాక్కెళ్లే ముఠాలు! సందట్లో సడేమియాలు.. టీడీపీ ఓట్లను తొలగించే పనిలో వైసీపీ నేతలు!
యద్దనపూడి మండలం గంగవరానికి చెందిన నాదెండ్ల చంద్రశేఖర్‌కి అదే ఊరిలో ఓటు ఉంది. దాన్ని తొలగించాలంటూ ఆయన పేరిట ఎవరో దరఖాస్తు చేశారు. మార్టూరులో 20 ఏళ్లుగా ఉంటున్న చెప్పుల వ్యాపారి రామినేని శ్రీనివాసరావు దంపతుల ఓట్లను తొలగించాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు దరఖాస్తు చేశారు. విచారణకు హాజరైన ఆ దంపతులు అసలు తాము దరఖాస్తే చేసుకోలేదని చెప్పారు. జైభీమ్ భారత్ పార్టీ పర్చూరు నియోజకవర్గ కన్వీనర్ జెట్టి శివ ఓటు తొలగించాలంటూ ఆయన పేరిట ఎవరో దరఖాస్తు చేశారు. తానెందుకలా దరఖాస్తు చేస్తానని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పర్చూరు నియోజకవర్గంలో లెక్కలేనన్ని ఉన్నాయి.