MLA Anagani Satya Prasad on Polavaram tender: కమీషన్ల కక్కుర్తితో జగన్ రెడ్డి పోలవరాన్ని బలి చేస్తున్నారంటూ.. బాపట్ల జిల్లా రేపల్లె తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ విడుదల చేశారు. గత నాలుగేళ్లల్లో 4 శాతం పనులు కూడా పూర్తి చేయని మేఘా కంపెనీకే తిరిగి డయాఫ్రం వాల్ పనులు కట్టబెట్టడం దేనికి సంకేతమని లేఖలో ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా కంపెనీకి ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేతగానితనంతో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పనులకు నామమాత్రంగా టెండర్లు పిలిచారని లేఖలో అనగాని ఆరోపించారు.
ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ:పోలవరంలో 4 ఏళ్లల్లో 4 శాతం కూడా పూర్తి చేయని మేఘా మళ్లీ పనులా అంటూ అనగాని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తికి పోలవరాన్ని బలి చేస్తున్న జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వు టెండరింగ్ వడ్డించేవాడు మన వాడైనప్పుడు ఏ బంతిలో కూర్చున్నా పర్వాలేదనే సామెత జగన్ రెడ్డి, మేఘా కంపెనీలకే సరిపోతుందని విమర్శించాడు. 4 ఏళ్లల్లో 4 శాతం పనులు కూడా పూర్తి చేయని మేఘా కంపెనీకే తిరిగి పోలవరంలో డయాఫ్రం వాల్ పనులు కట్టబెట్టడం దేనికి సంకేతమని అనగాని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా కంపెనీకి ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. జగన్ రెడ్డి చేతగానితనంతో, నిర్లక్ష్య వైఖరితో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పనులకు నామమాత్రంగా టెండర్లు పిలిచి టెండర్ నిబంధనలకు ఉల్లంఘించి రూ.1615.75 కోట్ల పనులను మేఘా ఇంజినీరింగ్ కు దోచిపెడుతున్నారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రూ.100 కోట్లు దాటిన ఏ కాంట్రాక్ట్కైనా జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసిన తరువాతే ఆ పనులు చేపడతామని జగన్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజు చెప్పారని లేఖలో గుర్తుకు చేసిన అనగాని.. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని జ్యుడీషియల్ ఎంక్వైరీ చేశారో చెప్పే దమ్ము జనగ్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో 71 శాతం పనులు, 24 గంటల్లో, 32,350 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన నవయుగ కాంట్రాక్ట్‌ను కక్షపూరితంగా తప్పించి మేఘా సంస్థకు పనులు అప్పగించి పోలవరాన్ని అటకెక్కించారని అనగాని ఎద్దేవా చేశారు.