'మా ప్రభుత్వం మా ఇష్టం' అనే రీతిలో వైకాపా నేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలంలో మట్టి అక్రమ తవ్వకాల పరిశీలనకు వచ్చిన ఆనంద్‌బాబును వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తెదేపా కార్యకర్తలు ఆరోపించగా.. వైకాపా వర్గీయులు వారితో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో మట్టి తరలింపును ఒప్పుకునేది లేదని తెదేపా శ్రేణులు నిరసనగా దిగారు. అధికారులందరికీ అక్రమ మైనింగ్ గురించి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆనంద్‌బాబు మండిపడ్డారు.
Nakka: 'మా ప్రభుత్వం మా ఇష్టం' అనే రీతిలో వైకాపా నేతల అక్రమ తవ్వకాలు - tdp leader nakka on illegal mining latest news
బాపట్ల జిల్లా చుండూరు మండలంలో మట్టి అక్రమ తవ్వకాల పరిశీలనకు వచ్చిన తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబును వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా ప్రభుత్వం మా ఇష్టం అన్న రీతిలో వైకాపా నేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని నక్కా ఆరోపించారు.
మా ప్రభుత్వం మా ఇష్టం అన్న రీతిలో వైకాపా నేతల అక్రమ తవ్వకాలు