Suryalanka beach: కార్తికమాసం నాలుగో ఆదివారం సందర్భంగా సముద్రతీరాలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం, చినగంజాం సముద్రతీరాలకు పెద్దమొత్తంలో పర్యటకులు తరలివచ్చి.. సముద్ర స్నానాలు ఆచరించారు. వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో వనభోజనాలు జరిగాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు మైకుల ద్వారా సూచనలు చేశారు.. సూర్యలంక సముద్రతీరంలో తప్పిపోయిన 20 మంది చిన్నారులని రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి తల్లిదండ్రులకు అప్పగించారు. భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా.. బాపట్ల రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
కార్తికమాసం పురస్కరించుకొని సూర్యలంక బీచ్‌కు పోటెత్తిన పర్యటకులు - Bay of bengal
Surya lanka beach: కార్తికమాసం నాలుగో ఆదివారం సందర్భంగా సముద్రతీరాలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. కార్తికమాసం సందర్భంగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం, చినగంజాం సముద్రతీరాలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా.. బాపట్ల రూరల్ సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
చినగంజాం మండలంలోని సముద్రతీరాల్లో కూడా పర్యాటకులు సందడి చేశారు.. వేటపాలెం మండలం రామాపురం సముద్రంలో గుంటూరుకు చెందిన యాభై మంది సముద్ర స్నానాలకు వచ్చారు. సముద్రస్నానాలు చేస్తుండగా భావన(16), రిషిత(14)లు సముద్రంలో కొట్టుకుపోతుండగా.. మెరైన్ సిబ్బంది కాపాడారు. అనంతరం వారిని వారి బంధువుల సహాయంతో వైద్యశాలకు తరలించారు. కొత్తపట్నం మెరైన్ సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, సుబ్బారావు కాపాడారు. పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: