ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

State Election Officer Report to CEC on Parchuru Incident: పర్చూరు ఓట్ల జాబితాలో అక్రమాలు.. సీఈసీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నివేదిక - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా

State Election Officer Report to CEC on Parchuru Incident పర్చూరు ఓట్ల జాబితా తయారీలో అక్రమాలపై సీఈసీకి నివేదిక అందజేసినట్లు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు. సీఐ, ముగ్గురు ఎస్‌ఐల సస్పెన్షన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపామన్న ఆయన.. బాపట్ల ఎస్పీ వివరణను కూడా జత చేసినట్లు ప్రకటనలో వెల్లడించారు. అయితే.. MLA ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టుకు వెళ్లేంతవరకూ.. స్థానిక అధికారులు ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు.

State Election Officer Report to CEC on Parchuru Incident
State Election Officer Report to CEC on Parchuru Incident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 7:32 AM IST

State Election Officer Report to CEC on Parchuru Incident: పర్చూరు ఘటనపై సీఈసీకి నివేదిక పంపినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు. తటస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపు కుట్రలో భాగస్వాములైన.. మార్టూరు సీఐ టి.ఫిరోజ్‌, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు ఎస్సైలు ప్రసాద్‌, కె.కమలాకర్‌, కె.అనూక్‌ల.. సస్పెన్షన్‌, క్రమశిక్షణ చర్యలపై జారీ చేసిన నోటీసు వివరాలను పొందుపరిచామని మీనా వెల్లడించారు. ఆ ప్రక్రియలో పాలు పంచుకున్న మహిళా పోలీసు బీఎల్‌ఓలపైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టామని, అభియోగాలు నమోదు చేశామని తెలిపారు. ఆ ఘటనపై బాపట్ల ఎస్పీ వివరణ కూడా తీసుకుని ఈసీకి నివేదించినట్లు ప్రకటన చేశారు.

వైసీపీ సర్కార్ నయా ఆయుధం 'ఫారం-7'... ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఓట్ల తొలగింపు

Police Officers involved in Voterlist Changes: కొందరు పోలీసు అధికారులు మహిళా పోలీసు బీఎల్‌ఓల ద్వారా ఫారం-7 దరఖాస్తుల వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 2023 ఆగస్టులో ఈసీకి ఫిర్యాదు చేశారు. ముగ్గురు ఎస్సైలు, కొందరు మహిళా పోలీసు బీఎల్‌ఓలతో మార్టూరు సీఐ వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారని... వారి చాటింగ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను ఎమ్మెల్యే తన ఫిర్యాదుకు జత చేశారు. దీంతో ఈసీ విచారణకు ఆదేశించింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో, వాటిని నివారించేందుకు ముందస్తు సమాచార సేకరణ కోసమే ఆ వాట్సప్‌ గ్రూప్‌ని ఏర్పాటు చేసినట్టు పోలీసులు విచారణలో పేర్కొన్నారు. దానిపై ఈసీ తీవ్రంగా స్పందించి, వారిపై చర్యలకు ఆదేశించింది. దీంతో చర్యలు తీసుకున్నట్లు మీనా వెల్లడించారు.

తప్పుల తడకగా బందరు ఓటర్ల జాబితా.. ఎన్నికల సంఘం ఆదేశించినా పట్టించుకోని అధికారులు

Police Officers Suspend: వైకాపా నాయకులకు కొమ్ము కాస్తూ, ప్రజల ఓట్లు తొలగించే కుట్రలో పోలీసులు భాగస్వాములవడం తీవ్ర నేరం. వారిని సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయాల్సి ఉండగా.. ఎన్నికల సంఘం కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టింది. ఒక నియోజకవర్గంలో సీఐ సహా ముగ్గురు ఎస్సైలు ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి మరీ.. ఫారం - 7 దరఖాస్తుల వివరాల్ని ఎప్పటికప్పుడు సేకరించారు. వాటితో ఓట్ల తొలగింపు కుట్రలో భాగస్వాములయ్యారు. ఇంత జరిగితే ఉన్నతాధికారులు కళ్లుమూసుకున్నారా ? ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వారున్నారా ? హైకోర్టు ఆదేశించేంత వరకూ ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ? ఎమ్మెల్యే ఆరోపించినట్లుగా ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందా ? బీఎల్‌ఓలుగా మహిళా పోలీసుల్ని ఎలా నియమించారు ? వంటి ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వలేదు.

ఆంధ్రప్రదేశ్​లో 27 లక్షల దొంగ ఓట్లు.. వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం

ABOUT THE AUTHOR

...view details