ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

School Bus Driver Died Due to Heart Attack: బాపట్లలో కలకలం రేపిన పాఠశాల బస్సు డ్రైవర్​ మరణం.. ప్రయాణంలోనే గుండెపోటు.. - పాఠశాల బస్సు డ్రైవర్​ మరణం

School Bus Driver Died Due to Heart Attack: బాపట్ల జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్​ గుండెపోటు వచ్చి మరణించిన ఘటన కలకలం రేపింది. డ్రైవర్​కు గుండెపోటు వచ్చిన సమయంలో అతని వెంట బస్సులో విద్యార్థులు ఉండటం.. వారికి ఎలాంటి ఆపాయం సంభవించకుండా సురక్షితంగా బయటపడ్డారు.

School_Bus_Driver_Died_Due_to_Heart_Attack
School_Bus_Driver_Died_Due_to_Heart_Attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 2:11 PM IST

School Bus Driver Died Due to Heart Attack: స్కూల్​ విద్యార్థులతో పాఠశాలకు బయల్దేరిన పాఠశాల బస్సు డ్రైవర్​కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఘటన.. బాపట్ల జిల్లాలో కలకలం రేపింది. దాదాపు 45 మంది విద్యార్థులతో నిండి ఉన్న ఆ బస్సు డ్రైవర్​ ఇలా గుండెపోటుకు గురికావటంతో.. బస్సులోని విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. బస్సులో అసలేం జరుగుతుందో అర్థంకాకా విద్యార్థులు గందరగోళ స్థితిలోకి చేరుకున్నారు. డ్రైవర్​ గుండెపోటుకు గురయ్యాడని తెలియక విద్యార్థులు అటువైపుగా వెళ్లే స్థానికులకు పరిస్థితి వివరించగా.. అప్పటికే డ్రైవర్​ మృతి చెందినట్లు వారు గుర్తించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లాలోని అద్దంకి మండలం ఉప్పలపాడు గ్రామ శివారులోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సును.. అద్దంకికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఎప్పటిలాగానే బల్లికురవ మండలం గొర్రెపాడు గ్రామంలో స్కూల్​ విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరాడు. అదే దారిలోని ఉప్పలపాడు గ్రామంలోని మరికొంతమంది విద్యార్థులను ఎక్కించుకుని అక్కడి నుంచి పాఠశాలకు బయల్దేరాడు.

School Bus Accident: పంట పొలాల్లో పల్టీకొట్టిన స్కూల్ బస్సు.. 14మంది విద్యార్థులకు గాయాలు

ఈ క్రమంలో ఉప్పలపాడు గ్రామ శివారుకు చేరుకునే సరికి.. పాఠశాల బస్సు రోడ్డుకు అటూ ఇటూగా.. గతి తప్పుతున్న విధంగా నడవటాన్ని బస్సులోని విద్యార్థులు గమనించారు. బస్సు అదుపు తప్పుతోందని భావించి విద్యార్థులు ఆందోళనలతో కేకలు వేశారు. దీంతో డ్రైవర్​ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు.

ఏం జరిగిందోనని కొందరు విద్యార్థులు డ్రైవర్​ దగ్గరికి వెళ్లి చూడగా.. సీటులో పక్కకి పడిపోయి ఉన్నాడు. దీంతో డ్రైవర్​కు ఫిట్స్​ వచ్చిందేమో అనుకుని.. అతని చేతిలో తాళాలు ఉంచారు. అప్పటికీ అతను స్పృహలోకి రాకపోయే సరికి.. అదే దారిలో వెళ్తున్న స్థానికులకు విద్యార్థులు జరిగిందంతా వివరించారు. ఈ క్రమంలో స్థానికులు సీట్లో పడి ఉన్న డ్రైవర్​ దగ్గరికి వెళ్లి పరిశీలించారు.

School Bus Accident: పాఠశాల బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం

స్థానికులు చూసే సరికే డ్రైవర్​ ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు గుర్తించారు. బస్సు అటుఇటూ కదిలిన సందర్బంలో ఏ విద్యార్థికి కూడా గాయలు కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని స్థానికులు వివరించారు. ఈ ప్రమాదం సంభవించినప్పుడు మొత్తం 45మంది విద్యార్థులు బస్సులో ఉన్నారని సమాచారం.

చెరువులో పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థి దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details