YCP Office issue: బాపట్ల జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణానికి బాపట్లలో మంత్రులు నాగార్జున, కొట్టు సత్యనారాయణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిలు శంకుస్థాపన చేశారు. అయితే అ స్థలం తమదంటూ ఆర్టీసీ అధికారులు రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పట్టణంలోని విద్యానగర్ కాలనీ సమీపంలో ఆర్టీసీ గ్యారేజి వెనుక 4 ఎకరాల స్థలం ఉంది. దీనికి సమీపంలో నుంచే 216 జాతీయ రహదారి వెళుతుంది. రహదారి పక్కనే ఉన్న కోట్ల విలువైన భూమిని వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 33 ఏళ్ల లీజుకు ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఈ రోజు మంత్రులు, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేయగా.. దీనిపై ఆర్టీసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాపట్ల వైసీపీ కార్యాలయ స్థల వివాదం.. పోలీసులకు ఆర్టీసీ ఫిర్యాదు - బాపట్ల జిల్లా తాజా వార్తలు
YCP Office issue: బాపట్ల జిల్లా వైసీపీ కార్యాలయం స్థలం విషయంలో వివాదం నెలకొంది.. ఆర్టీసీ స్థలంలో వైసీపీ కార్యాలయానికి మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి నాగార్జున, శాసన సభ్యులు కోన రఘుపతి శంకుస్థాపన చేశారు. అయితే ఆర్టీసీ స్థలంలో శంకుస్థాపన చేయటంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస రెడ్డి, అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైసీపీ కార్యాలయం
ఈ స్థలాన్ని 1990లో ఆర్టీసీ కొనుగోలు చేసిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతంలోనే ఏపీఐఐసీ ఆర్టీసీకి స్థలం కేటాయించిందని.. సంస్థ ఆస్తులు కాపాడుకునే బాధ్యత తమపై ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ స్థలం ఆర్టీసీకి చెందినదని వైసీపీ కార్యాలయం ఎలా కడతారని రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: