Removal Votes in Parchur: పర్చూరు ఓట్ల దొంగలపై చర్యలకు అధికారులు మీనమేషాలు Removal Votes in Parchur :ఓట్ల అవకతవకల వ్యవహారం బయటపడ్డా కూడా అధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల దొంగలపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తప్పుడు సమాచారమిచ్చి ఓట్లను తొలగించేందుకు పెద్ద మొత్తంలో దరఖాస్తులు సమర్పించిన వారిలో.. ఇప్పటివరకూ 194మందిని గుర్తించినా.. వారిలో 14మందిపైనే కేసులు పెట్టారు. గురువారం మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ 16మంది మినహా మిగిలినవారిలో ఎక్కువమంది వైఎస్సార్సీపీ వారు కావడమే చర్యలు తీసుకోకపోవడానికి కారణమని తెలుస్తోంది.
Illegal Votes in Parchur :పర్చూరులో ఓట్ల తొలగింపు ఫిర్యాదులపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించడంతో.. బల్క్ దరఖాస్తులపై జేసీ శ్రీధర్ విచారణ చేసి నివేదికను పంపారు. అయిదుకు మించి దరఖాస్తులు సమర్పించిన వారు 194 మంది ఉన్నారని గుర్తించారు. వీరిలో చాలామంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే. వీరంతా కలిసి 13 వేలకుపైగా దరఖాస్తులు సమర్పించారు. వీటిపై విచారణకు కమిటీలు వెళ్లినపుడు వీళ్లంతా మొహం చాటేశారు. తొలగింపునకు గురవుతున్న ఓటర్లను అధికారులు పిలిపించి విచారించారు. తాము ఊళ్లోనే ఉన్నామని, ఆధార్‌కార్డులూ ఇక్కడే ఉన్నాయని తెలిపారు.
Four Police Officers Suspended: పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలు.. సస్పెన్షన్ వేటుతో సరిపెట్టేశారు
Officials No Action on Parchur Votes Stealers :ప్రతినెలా రేషన్, పింఛన్ తీసుకుంటున్నామని డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉన్నాయంటూ చూపించటంతో అధికార యంత్రాంగం అవాక్కయింది. అయినా తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు. హైకోర్టులో కేసు నమోదవడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద 14మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించారు. గురువారం మరో ఇద్దరిపై ఫిర్యాదు చేశారు.
MLA Eluri Sambasivarao Letter to EC for Deletion of Votes in Parchur :పర్చూరు నియోజకవర్గంలో తటస్థులు, ప్రతిపక్షాలకు చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఓట్ల దొంగలు ఫారం-7లను పెద్ద సంఖ్యలో సమర్పించారు. బతికున్నవారిని చనిపోయారని.. ఉపాధి కోసం వెళ్లిన వారిని ఊరి నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారని.. ఇలా తప్పుడు కారణాలు చూపి వారి ఓట్లు తొలగించాలని కోరుతూ 13వేల దరఖాస్తులు సమర్పించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి గత ఆగస్టులో ఫిర్యాదు చేశారు.
Cases Filed on False Form 7 Applicants అధికార పార్టీ నయా ఆయుధం ఫారం-7! కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు
Cancellation Votes in Parchur Constituency :సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసులతో మార్టూరు సీఐ ఫిరోజ్ సహా ముగ్గురు ఎస్సైలు వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఫారం-7 దరఖాస్తులపై సమీక్ష చేయటం, వివరాలు సేకరించి నాయకులకు అందించడం వంటివి చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఏలూరి ఫిర్యాదు మేరకు హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే బాధ్యులైన పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
Votes Deleted Issue in AP :కానీ, తప్పుడు సమాచారమిచ్చిన వారిపై మాత్రం చర్యలు చేపట్ట లేదని, బాధ్యులందరిపైనా చర్యలు తీసుకునేవరకూ తన న్యాయపోరాటాన్ని ఆపబోనని ఏలూరి స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులను స్వీకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు.
Irregularities in AP Voter List: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల జాబితాలో అక్రమాలు.. నయా ఆయుధం 'ఫామ్-7'తో వైసీపీ సర్కార్..