Illegal Ration Rice: బాపట్లలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ అధికారి మాధవరెడ్డి ఆదేశాల ప్రకారం.. బాపట్ల జిల్లా నుంచి కాకినాడకు రేషన్ బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అందులో 520 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు విజిలెన్స్ సీఐ శ్రీహరి తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారంతో నూతలపాడులో దాడిచేసి పట్టుకున్నామన్నారు. లారీలో ఉన్న బియ్యం, లారీడ్రైవర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుబడిన రేషన్ బియ్యం సుబ్బారెడ్డిపాలెం, నూతలపాడు ప్రాంతాల నుంచి లారీలో కాకినాడ తరలిస్తున్నట్లుగా ప్రాధమిక విచారణలో వెల్లడైందని.. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 520 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - Illegal Ration rice
Illegal ration rice: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు నుంచి కాకినాడకు రేషన్ బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీని పట్టుకున్నారు. అందులో 520 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు విజిలెన్స్ సి.ఐ శ్రీహరి తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత