Ramapuram Fishermen Dispute: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో మళ్లీ వివాదం రాజుకుంది. ఇరువర్గాల ఘర్షణలో గ్రామస్థులతో పాటు చీరాల రూరల్ సీఐ మల్లికార్జున రావు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఫిబ్రవరిలో రామాపురం గ్రామానికి చెందిన ఒకరు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్థులు అతన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన 85 కుటుంబాలు గ్రామం నుంచి బయటకు వచ్చి వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు.
వీరిలో కొంతమంది కఠారివారిపాలెం సమీపంలో గుడారాలు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు. దీనిపై ఈ నెల 20 వ తేదీన ఇరు వర్గాలను కలిపేందుకు తీర ప్రాంత పెద్దలు చేసిన ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాటి జరగడంతో.. ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రయత్నం విఫలం కావడంతో కేసులు పెట్టుకున్నారు.
Disputes Between Fishermen: ఊపిరి పీల్చుకున్న రామాపురం వాసులు.. మూడు నెలల తర్వాత సుదీర్ఘ వివాదానికి తెర
దీంతో అప్రమత్తమైన పోలీసులు వారం రోజుల పాటు రామాపురంలో పొలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం 24వ తేదీన మత్స్యకార పెద్దల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కలిపారు. అప్పటి వరకూ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
వివాదానికి తెర పడింది అనుకునే లోపే..:వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే తాజాగా మరోసారి గొడవ జరిగింది. బుధవారం సాయంత్రం చేతబడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వర్గానికి చెందిన వారికి, గ్రామస్థులకు మధ్య మాటమాటా పెరిగింది. ఈ సమయంలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. చీరాల రూరల్ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని.. పోలీసుల సాయంతో వివాదం ఆపేందుకు ప్రయత్నించారు.
Police Picketing: రెండు గ్రామాల మధ్య వివాదం.. భారీగా పోలీసుల మోహరింపు
ఇరువర్గాల ఘర్షణలో సీఐ మల్లికార్జునరావుతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, మరో 10 మంది గ్రామస్థులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చీరాల నియోజకవర్గ వైసీపీ బాద్యుడు కరణం వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
మరోసారి పోలీసుల పికిటింగ్:రామాపురం గ్రామస్థుల మధ్య మరోసారి ఘర్షణ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.రామాపురం గ్రామంలో భారీ బందోబస్తుతో పికిటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. చీరాల డీఎస్పీ కె. ప్రసాదరావు తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ అన్నారు.
"మాకు అసులు ఏం జరుగుతుందో తెలియదు. మేము వచ్చి కాళ్లు కడుక్కొని ఇంట్లోకి వెళ్లాం.. మేము వచ్చే సరికి అక్కడ గొడవ జరుగుతుంది. ఏం జరుగుతుందో మాకు తెలియదు. వచ్చి మా అత్తను కొడుతున్నారు. ముసలావిడను.. ఆవిడను ఎందుకు కొడుతున్నారు.. అసలు ఆవిడ ఏం చేసింది అని అడిగాము. అలా అడిగితే మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. మొత్తం వందల మంది ఒక్కసారిగా వచ్చే సిరికి మేము ఇంట్లోకి వచ్చేశాము. ఇంట్లోకి వచ్చి.. ఎలా పడితే అలా కొట్టారు". - అంకమ్మ, రామాపురం గ్రామస్థురాలు
రామాపురంలో మళ్లీ ఘర్షణ.. పోలీసులు సహా 15 మందికి గాయాలు