Ramachandrabharathi Arrested Again:తెలంగాణలో రెండు వేరువేరు చిరునామాలతో నకిలీ పాస్‌పోర్టులు తీసుకున్న కేసులో, ఎమ్మెల్యేల ఎర కేసు ప్రధాన నిందితుడు రామచంద్రభారతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడా జైలుకు తరలించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు నకిలీ పాస్‌పోర్టులను కలిగి ఉన్నారని గతంలో బంజారాహిల్స్ పోలీసులు 420, 468, 471, మోటార్ వెహికల్ చట్టం 42, ఇన్కమ్ టాక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
మళ్లీ అరెస్టైన రామచంద్రభారతి.. ఈసారి ఆ కేసులో.. - రామచంద్రభారతి మరోసారి అరెస్ట్
Ramachandrabharathi Arrested Again: తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు ప్రధాన నిందితుడు రామచంద్రభారతి మళ్లీ అరెస్టయ్యాడు. ఇంతకీ కేసు ఏంటంటే..!
![మళ్లీ అరెస్టైన రామచంద్రభారతి.. ఈసారి ఆ కేసులో.. Ramachandra Bharati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17155239-305-17155239-1670561080321.jpg)
రామచంద్రభారతి