Bharat Jodo Yatra End Today in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో నేడు ముగియనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర.. మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో 12 రోజుల పాటు సాగిన యాత్ర ఇవాళ్టితో 375 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్‌గాంధీ.. తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
తెలంగాణలో నేటితో ముగియనున్న భారత్ జోడో యాత్ర.. సభకు భారీ ఏర్పాట్లు - Bharat Jodo Yatra End Today in Telangana
Bharat Jodo Yatra Ends Today in Telangana: తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు దిగ్విజయంగా సాగిన యాత్ర.. నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Rahul padayatra
ఈ క్రమంలోనే తనను కలవడానికి వస్తున్న మేధావులు, ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ సమాలోచనలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జుక్కల్ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ కావడంతో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇవీ చూడండి..