ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్చూరు​లో పోలీసులకు ఫారం-7 తిప్పలు - ఫారం7 పర్చూరు తాజా వార్తలు

police investigation on false form-7 applications in parchuru : ఓట్ల పండుగకు ముందు గడప గడపకి రాజకీయ నాయకుల ప్రచార కొనసాగడం సర్వసాధారణం.. కానీ బాపట్ల జిల్లాలో పోలీసు అధికారులు, ఊరంతా తిరుగుతున్నారు. అయితే ఎన్నికల ప్రచారం కోసం కాదు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫారం-7 దరఖాస్తులు అధికమవడంపై బాపట్ల జిల్లా పర్చూరులో పోలీసులకు ఈఆర్వో లేఖ రాసింది. గతంలో జరిగిన సంఘటనల దృష్టా పోలీసులు అప్రమత్తులై దర్యాప్తు చేపట్టారు.

Etv BharatElections Issue in Parchuru
Police Investigation on False Form-7 Applications in Parchuru

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 1:42 PM IST

పర్చూరు​లో పోలీసులకు ఫారం-7 తిప్పలు..

Police Investigation on False Form-7 Applications in Parchuru : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో కొందరు తప్పుడు సమాచారంతో ఓట్ల తొలగింపు కోరుతూ ఫారం-7 దరఖాస్తు చేసినట్లు అధికారులు విచారణలో తేలింది. బాధ్యులపై చర్యలు కోరుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్చూరు, మార్టూరు, యద్దనపూడి, ఇంకొల్లు, కారంచేడు, చిన గంజాం స్టేషన్ల పరిధిలో 16 మంది పై పోలీసులు కేసులు నమోదు చేసి మిన్నకుండిపోయారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారుల నిర్వాకంపై ఎస్పీకి లేఖ రాసి హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆగమేఘాలమీద శుక్రవారం పోలీసులు దర్యాప్తునకు ఉపక్రమించారు. తప్పుడు సమాచారమిచ్చి.. ఎవరి ఓట్లయితే తొలగించాలని దరఖాస్తుల్లో పేర్కొన్నారో... ఆ ఇళ్లకు వెళ్లి వారి స్టేట్‌మెంట్‌ని నమోదు చేసుకుని నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలు.. సస్పెన్షన్‌ వేటుతో సరిపెట్టేశారు

HI-Court Notice to Police on False Form-7 applications : ఓట్లు నమోదు, చేర్పు తమపని కాదని కేవలం ఈఆర్వో చేసిన ఫిర్యాదులపై మాత్రమే దర్యాప్తు చేస్తున్నామని పోలీసుల వర్గాలు పేర్కొన్నాయి. 16 కేసులకు సంబంధించి సుమారు 1200 దరఖాస్తుల్లో ఉద్దేశపూర్వకంగానే ఓట్లు తొలగించాలని కోరినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గతంలో మార్టూరు ఇన్ స్పెక్టర్ ఫిరోజ్ తన సర్కిల్ పరిధిలోని అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఫారం-7 దరఖాస్తులపై వివరాలు కోరటాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తప్పుబట్టారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నలుగురు పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేశారు. గత చర్యలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ప్రస్తుత దర్యాప్తులో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విష్ణుకు చిరు అభినందనలు.. 'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

Elections Issue in Parchuru : ఫారం-7 పేరుతో వచ్చిన దరఖాస్తులు ఉద్ధేశ పూర్వకంగా వచ్చాయని పోలీసులు నిర్దారించారు. ప్రతిపక్షాలు కావాలని కుట్రతో ఈ చర్యలకు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపణలు చేసిన విషయం విధితమే.

అనుకూలమైతేనే ఓటర్ల జాబితాలో పేరు.. ఇదే అధికార పార్టీ తీరు

ABOUT THE AUTHOR

...view details