Adibatla Kidnap Case Updates: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని మూడు రోజుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే చర్లపల్లి జైలు నుంచి నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కిడ్నాప్ సీన్ రీ-కనస్ట్రక్షన్ చేయనున్నారు.
అసలేం జరిగిదంటే: అమెరికా పెళ్లి సంబంధం రావడంతో మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలికి ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 36 మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు. నవీన్‌రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు.