ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MURDER: బాపట్ల జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. అతని పనేనంటూ ఆందోళన - Concern in Bapatla district

Murder in Bapatla district : బాపట్ల జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో.. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఊరిబయట రోడ్డుపై మృతదేహం పడి ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది సర్పంచ్ పనేనంటూ.. మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.

Murder in Bapatla district
Murder in Bapatla district

By

Published : Apr 21, 2023, 1:46 PM IST

Murder in Bapatla district : బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన రావి శివారెడ్డి ఉదయం అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. దీంతో కుటుంబంలో.. ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత బుధవారం రాత్రి ఓ వ్యక్తి వచ్చి బండి మీద తీసుకు వెళ్లాడు ఆ తర్వాత రోజు.. ఊరి బయట రోడ్డుపై శవమై కనిపించాడు. శివారెడ్డి మృతదేహం పడి ఉండటం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఈ హత్యకు కారణం అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత కావూరి శ్రీనివాసరెడ్డేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి తల్లి చిట్టెమ్మ సర్పంచి కావటంతో బాధితులపైనే ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో వారు ఆగ్రహంతో శివారెడ్డి మృతదేహంతో సర్పంచి ఇంటి ముందు అందోళనకు దిగారు.

ఉదయం నుంచి శ్రీనివాసరెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. హత్య కేసు నమోదు విషయంలో పోలీసుల మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో శివారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సర్పంచి మద్దతుదారులు అక్కడ నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పటంతో వివాదం రేగింది. హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళన చేశారు. రెండు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్దిచెప్పి వారిని పంపించివేశారు. శివారెడ్డి కుటుంబసభ్యులతో పోలీసులు చర్చిస్తున్నారు. ఇది వరకే భూ వివాదంలో శివారెడ్డికి, శ్రీనివాసరెడ్డికి ఎప్పటి నుంచో మధ్య విభేదాలు ఉన్నాయని అందువల్లనే చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే శివారెడ్డిని తీసుకెళ్లి గొలుసులతో బంధించి చంపేశారని ఆరోపిస్తున్నారు.

నేను ఊర్లో లేను బుధవారం రాత్రి బండి మీద తీసుకు వెళ్లారంట.. ఆ తరువాత రోజు పొద్దున్నే చంపేసి రోడ్డు మీత పడేశారు.. అని ఏవరో వ్యక్తి చూసి చెప్పారు. ప్రెసిడెంట్ నలుగురు వ్యక్తులను మాట్లాడి చంపించారు. ఈ స్థలం గురించి ఇద్దరూ అప్పుడప్పుడు గొడవ పడుతుంటారు.- మౌనిక సాయి, మృతుని భార్య

స్థలం గురించి ఇద్దరూ అప్పుడప్పుడు గొడవ పడుతుంటారు.. అప్పటి నుంచి నా కొడుకు మీద పగ పెట్టుకున్నారు. ఆ తరువాత ఇక్కడ ఉండ కుండా వేరే చోట అద్దెకు ఉంటున్నాడు. మాకు పోలీసులు న్యాయం చేయట్లేదు.- వెంకాయమ్మ, మృతుని తల్లి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details