person died after the wall collapsed: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వైదనకొప్పెర్పాడు గ్రామంలో అరుగు కలిసి ఉన్న ప్రహరీ కూలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముండ్లమూరు మండలం నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు గొర్రెలు కొనుగోలు చేసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం వి.కొప్పేర్పాడులో గొర్రెలు కొనుగోలు నిమిత్తం వెళ్లాడు. అక్కడే ఆరుబయట ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. ఆ అరుగు ఒక్కసారిగా కూలాటంతో ఏడుకొండలు కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మరణించాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆరుబయట అరుగు కూలి వ్యక్తి మృతి.... - Andhra Pradesh News
person died after the wall collapsed: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామంలో అరుగు కూలి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు గొర్రెలు కొనుగోలు కోసం కొప్పెరపాడుకు వెళ్లాడు. ఆరుబయట అరుగు మీద కూర్చున్న సమయంలో ఒక్కసారిగా కూలడంతో కింద పడ్డాడు. తలకు గాయం కావటంతో అక్కడికక్కడే మరణించాడు.
ఆరుబయట అరుగు కూలి వ్యక్తి మృతి