Threat: ‘ఎమ్మెల్సీ సునీతకు అనుకూలంగా పని చేయొద్దు... మా మాట వినకపోతే అంతు చూస్తాను..’ అని తన భర్త గోలి ఆనందరావును ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు, వైకాపా నేత కరణం వెంకటేష్ బెదిరించారని పేర్కొంటూ.. పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గోలి కుమారి ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేయగా శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Threat: 'నా భర్తకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి'.. ఎస్పీకి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ఫిర్యాదు - తన భర్త హాని ఉందని ఎస్పీకి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ఫిర్యాదు
Threat: ‘ఎమ్మెల్సీ సునీతకు అనుకూలంగా పని చేయొద్దు... మా మాట వినకపోతే అంతు చూస్తాను..’ అని తన భర్త గోలి ఆనందరావును ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు, వైకాపా నేత కరణం వెంకటేష్ బెదిరించారని పేర్కొంటూ.. పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గోలి కుమారి ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ఫిర్యాదు
బాపట్లలో ఈనెల 5న వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న తన భర్త ఆనందరావును ఎమ్మెల్సీ సునీతకు మద్దతుగా తిరగడం మానుకోవాలని వెంకటేష్ బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటేష్, ఆయన అనుచరుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని కుమారి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేసి పోలీసుల రక్షణ కల్పించాలని, బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఇవీ చూడండి: