Nakka Anand Babu: తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం పెంచాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా చుండూరు, అమృతలూరు మండలాల్లో తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని విక్రయించడమనేది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. పంట తేమపై ఆర్బీకేల్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి గింజను కొనాలని డిమాండ్ చేశారు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలి: నక్కా ఆనంద్ బాబు - due to Mandous cyclone crop submerged in bapatla
Nakka Anand Babu: మాండౌస్ తుపాను కారణంగా తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా చుండూరు, అమృతలూరు మండలాల్లో తుపానుకు దెబ్బతిన్న పంటపొలాల్ని ఆయన పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
నక్కా ఆనంద్ బాబు