MP Mopidevi on RTC Land Issue: ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఆస్తిని అయినా అవసరాల నిమిత్తం దేనికైనా వాడుకునే అధికారం.. ప్రభుత్వానికి ఉందని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆర్టీసీ ప్రైవేటు సంస్ద కాదని అది ప్రభుత్వంలో విలినమైపోయిందని.. విలీనం అయిన తరువాత ఆ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులేనని పేర్కొన్నారు. కేబినేట్ ఆమోదం పొందిన తరువాతే జీఓ ఇవ్వటం జరిగిందని మోపిదేవి తెలిపారు. బాపట్లలో ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి నామమాత్రపు రుసుముకే లీజుకు ఇవ్వడంపై దుమారం రేగడంతో మోపిదేవి వివరణ ఇచ్చారు.
ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులే: మోపిదేవి వెంకటరమణ - andhra pradesh news
Mopidevi Press Meet: ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందని ఆయన చెప్పుకొచ్చారు. బాపట్లలో ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి నామమాత్రపు రుసుముకే లీజుకు ఇవ్వడంపై దుమారం రేగడంతో మోపిదేవి వివరణ ఇచ్చారు.
"ఈ స్థలం గురించి 16-04-2003లో ఏపీఐఐసీ నుంచి భూమిని తమకు ఇచ్చారని.. దానిలో మిగిలిన నాలుగు ఎకరాలు అవసరం లేదని ఆనాడు ఉన్న ఆర్టీసీ డిపో మేనేజర్ ఏపీఐఐసీకి లెటర్ రాశారు. తరువాత మిగిలిన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీకి 08-08-2003లో ఏపీఐఐసీ నోటీసు ఇచ్చారు. కానీ ఆర్టీసీ స్పందించలేదు. దీంతో 19-11-2003లో రెండవ సారి షోకాజ్ నోటీసు ఇచ్చినా.. ఆర్టీసీ స్పందించలేదు. చివరిగా 08-12-2003 మూడవ సారి నోటీసులకు కూడా స్పందించకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటామని ఏపీఐఐసీ చెప్పింది. కానీ అప్పడు కూడా స్పందించకపోవడంతో..ఆ భూమిని ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుని రెవెన్యూకు అప్పగించింది. ఆర్టీసీ ప్రైవేటు సంస్థ కాదు.. అది ప్రభుత్వంలో విలీనమైంది. ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులే.. వాటిని అవసరాల నిమిత్తం దేనికైనా వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది". -మోపిదేవి వెంకటరమణ, ఎంపీ
ఇవీ చదవండి: