Mistakes in Bapatla District Voters List: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో తప్పులతడకగా ఉన్న ఓటర్ల జాబితాలో.. సమగ్ర పరిశీలన తర్వాత కూడా అవే తప్పులు పునరావృతమయ్యాయి. దాదాపు నెలరోజులు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి దీనిపై సమగ్ర పరిశీలన చేశారు. అయినా పాత జాబితాలో ఉన్నవే చాలా వరకు ఉండడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మరణించినవారి పేర్లను గుర్తించి.. తొలగించాలని సిఫార్సు చేశామని బూత్ స్థాయి అధికారులు చెబుతున్నారు.
అయినా చాలా వరకు పేర్లను తొలగించలేదు. జీరో డోర్ నంబర్లతో ఓట్లు ఉన్నాయని, వీటిని తొలగించాలని పలుమార్లు రాజకీయ పార్టీలతో అధికారులు నిర్వహించిన సమావేశంలో వారు విన్నవించినా అవే జాబితాలో చోటుచేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకు అంటే దాదాపు నెల రోజులపాటు ఇంటింటా ఓటర్లపరిశీలన నిర్వహించారు.
Fake Votes in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 27 లక్షల దొంగ ఓట్లు.. వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం
చాలా చోట్ల బీఎల్వోలు ఇంటింటికీ తిరగలేదనే ఆరోపణలూ వచ్చాయి. దీనిపై రాజకీయ పార్టీలు సైతం అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ముసాయిదా జాబితాను పరిశీలిస్తే ఇది నిజమనే దానికి బలం చేకూరుతోంది. కారణం.. ఇంటింటా పరిశీలన ముగిసిన తరువాత వచ్చిన ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ గతంలో మాదిరిగానే ఉండడం. దీనిపై పలుమార్లు రాజకీయ పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
అయినా ఇంకా అదే నంబర్లతో జాబితాలో చోటు చేసుకున్నాయి. చీరాల నియోజకవర్గంలోని బూత్ నంబరు 24లో అంకిరెడ్డి కావూరి, జాజిరెడ్డి కావూరి, శ్రీనివాస రెడ్డి అసోది, వెంకటలక్ష్మి కావూరి, అంకిరెడ్డి కావూరి అనే వారికి ఓట్లు జీరో ఇంటి నంబర్లతో ఉన్నాయి. వేటపాలెం బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో పీఎస్ నంబరు 20. అందులో 732 మందికి ఓట్లు 419), చెంచమ్మ (క్రమ సంఖ్య 422), ఇలా ఈ ఒక్క బూత్‌లోనే 29 మంది మృతులకు ఓట్లు కల్పించారు.